ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. మళ్లీ వర్షాలు పడనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్ప పీడనం..దూసుకొస్తుంది. దీంతో రేపటి నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు IMD హెచ్చరికలు జారీ చేసింది. ఇక రెండు రోజుల్లో తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదలనుకుంది అల్పపీడనం.

ఈ ప్రభావంతో రేపటి నుంచి 13వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నట్లు IMD హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని IMD కోరింది. అటు తెలంగాణ కు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నట్లు IMD హెచ్చరికలు జారీ చేసింది.