చాలా మంది వాస్తు పండితులు చెబుతున్న విషయాలని అనుసరిస్తూ వుంటారు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన ఎలాంటి బాధ ఉండదు. పైగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవి తొలగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరం అయ్యిపోతుంది. వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉండడం… వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే తొలగించడం వంటివి చేస్తే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ పోతుంది.
ఇదిలా ఉంటే చాలా మంది ఆర్ధిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ వుంటారు. ఆర్ధిక ఇబ్బందుల నుండి బయట పడాలంటే వాస్తు చిట్కాలని చూడాలి. వాస్తు శాస్త్రం ప్రకారం గులాబీ పూలతో ఆర్థిక బాధలని మనం తొలగించుకోవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం కర్పూరం తో పాటుగా గులాబీ రేకులని వెలిగిస్తే ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు. దేవుడికి ఇలా కర్పూరాన్ని వెలిగించి ఇవ్వడం వలన ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు. అలానే వాస్తు శాస్త్రం ప్రకారం ఎర్రటి గులాబీ పువ్వులని శుక్రవారం నాడు లక్ష్మీ దేవికి పెడితే వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి.
11 శుక్రవారములు మీరు ఇలా చేస్తే చాలా మంచిది. అదే విధంగా ఎర్రగులాబీలని ఇంట్లో ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. ఎర్ర గులాబీ పూల మొక్కల్ని కూడా ఇంట్లో పెంచుకోవడం మంచిది ఉత్తరం వైపు కానీ తూర్పు వైపుకి కానీ ఎర్ర గులాబీ మొక్కల్ని పెంచండి. చక్కటి ప్రయోజనాలను పొందొచ్చు.