ఏపీ రైతులకు షాక్‌.. ప్రతి కుటుంబంపై రూ.2.45 లక్షల అప్పు !

-

ఏపీ రైతులకు షాక్‌. తలసరి రుణభారంలో ఆంధ్రప్రదేశ్ రైతులు దేశంలో తొలి స్థానంలో నిలిచారు. రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబం పై రూ.2,45,554 అప్పు ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. శుక్రవారం రాజ్యసభలో ఆప్ సభ్యుడు సంజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు ఆయన జవాబు ఇచ్చారు.

జాతీయ స్థాయిలో ప్రతి రైతు కుటుంబం మీద రూ.74,121 కోట్ల రుణం ఉండగా, ఏపీ రైతులపై అంతకు మూడురేట్లు భారం ఉంది. ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానంలో కేరళ, పంజాబ్ నిలిచాయి. తలసరి రైతు కుటుంబం అప్పు రూ. 2 లక్షలు దాటిన రాష్ట్రాలు ఈ మూడే ఉన్నాయి. తెలంగాణలో ప్రతి రైతు కుటుంబంపై రూ.1,52,113 మేర రుణభారం ఉంది. అత్యధిక ఆప్పు వున్న రాష్ట్రాల్లో ఇది 5వ స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news