KGF -3 షూటింగ్ మొదలయ్యేది అప్పుడే..!!

-

శాండిల్ వుడ్ నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం కేజిఎఫ్-1. ఈ సినిమా విడుదలై భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా సీక్వెల్ గా వచ్చిన కే జి ఎఫ్ -2 సినిమా కూడా ఘనవిజయాలను అందుకున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. హీరోగా యష్ అద్భుతమైన నటనను ప్రదర్శించి పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఈ సినిమా రాజమౌళి స్థాయిని అందుకుంది అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా కేజిఎఫ్-3 సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా నిర్మాత విజయ్ కిరంగధూర్ మాట్లాడుతూ.. ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సలార్ సినిమా అయిపోయిన వెంటనే కేజిఎఫ్-3 సినిమా స్క్రిప్ట్ పనులు మొదలవుతాయని తెలియజేశారు. ఎన్టీఆర్ మూవీ పూర్తయిన తర్వాత కేజిఎఫ్-3 సినిమా షూటింగ్ మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్-3 సినిమాకి సంబంధించి అప్డేట్ రావడంతో ఒక్కసారిగా అభిమానులు చాలా సంబరపడిపోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఎలా ఉండబోతోంది అంటూ యష్ ఎలా కనిపించబోతున్నారు అంటూ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్టోరీలైన్ ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి డైరెక్టర్ ప్రశాంత్ పారితోషకం ఊహించని స్థాయిలో ఉందని అలాగే నటీనటుల రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచేసారని వార్తలు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమా అయిపోయిన వెంటనే ఈ చిత్రాన్ని మొదలుపెట్టబోతున్నట్లు శాండిల్ వుడ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా అసలు విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news