నా భర్త ఒక పెద్ద శాడిస్ట్! చిత్ర హింసలు పెట్టాడు..!!

-

ఎప్పుడూ ఎదో ఒక వివాదంలో నిలిచే కరాటే కళ్యాణి తరచూ ఆమె వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ఒక యుట్యూబ్ ర్ ను నడి రోడ్డు మీద కొట్టిన విషయంలో, ఒక బాబు ను అక్రమంగా పెంచుకుంటున్న విషయంలో  , అలాగే  సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ మీద కూడా ఒక పాట పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి హడావుడి చేసిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా ఆమె తన భర్త పెట్టిన కష్టాలు గురించి చెపుతూ కన్నీరు పెట్టారు.

కరాటే కళ్యాణి తన గురించి చెబుతూ నన్ను చాలా మంది తప్పుగా అర్ధం చేసుకుంటూ ఉంటారు. అందరితో ఎప్పుడూ గొడవలు పెట్టుకుంటూ ఉంటానని అనుకుంటూ ఉంటారు. కాని చాలా మందికి నాలో ఉన్న మంచి తనం తెలియదు. ఎవరికైనా ఆపద వుంటే వెంటనే రంగంలోకి దిగుతాను. ఎవరైనా కష్టాల్లో ఉంటే నేను తట్టుకోలేను, ఇప్పటికే ఎంతో మంది కి నేను సహాయం చేశానని చెప్పుకొచ్చింది

ఇకతన వివాహం గురించి చెబుతూ తన భర్త చిత్రహింసలు పెట్టేవాడిని.. రోజు తాగొచ్చి తనను కొట్టేవాడని అన్నారు. అలాగే ఒకసారి తాగి నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే నా బట్టలు లాగి నన్ను అవమాన పడేలా చేశాడని దాన్ని నా జీవితంలో మార్చి పోనని వ్యాఖ్యానించింది. రోజు రోజుకు అతని శాడిస్ట్ చేస్టలు పెరుగుతూనే ఉన్నాయని అందుకే.ఇక అతని చిత్రహింసలు భరించలేక విడిపోయానని అన్నారు. చాలా రోజుల నుండి ఒంటరిగా ఉంటున్నానని, నా తల్లి నన్ను రెండో పెళ్లి చేసుకోమని అంటున్నారని ఆ విషయంలో ప్రస్తుతం ఏమి చేయాలో అర్థం కావడం లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news