పేషెంట్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్..గూగుల్ లో మరో కొత్త ఫీచర్..

-

సాదారణంగా డాక్టర్లు రాసిన అక్షరాలు ఒక్క మందుల షాప్ వాళ్ళకు మాత్రమే అర్థం అవుతుంది..వేరే వాళ్ళకు మాత్రం దాని పేరు కూడా కనుక్కోవటం కష్టమే..ఒక్కోసారి మెడికల్ షాప్ వాళ్లకూ అర్థం కాక జుట్టు పీక్కుంటారు. ఏదానికైనా కూడా గూగుల్ తల్లి ఉండగా టెన్షన్ ఎందుకు దండగ అంటున్నారు కొందరు.. వీళ్ళ భాష కోసం కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకోని వచ్చింది. ఈ ఫీచర్తో డాక్టర్ల చేతిరాతను సింపుల్గా డీకోడ్ చేసుకునే వీలుంటుంది. జస్ట్ డీకోడ్ చేయడమే కాదు. ట్రాన్స్లేట్ కూడా చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీలతో ఈ స్పెషల్ ఫీచర్ను రూపొందించింది.

చదవడానికి కష్టతరంగా ఉండే టెక్స్ట్ని చాలా సులువుగా డీకోడ్ చేయడం ఈ ఫీచర్ ప్రత్యేకత. కేవలం డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లు అనే కాదు. అర్థం కాదని చేతిరాతలన్నింటినీ అర్థమయ్యేలా చేస్తుంది. గూగుల్ లెన్స్ సాయంతో ఇది వీలవుతుంది. ఉదాహరణకు… డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉందనుకుందాం. మనం గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి ఆ చీటీని ఓ ఫోటో తీయాలి. వెంటనే గూగుల్ అందులోని టెక్స్ట్ని స్కాన్ చేస్తుంది. గూగుల్ లెన్స్ అందులో ఉన్న టెక్స్ట్ని డీకోడ్ చేసి హైలైట్ చేసి చూపిస్తాయి. కేవలం మనం చూడడమే కాదు. డీకోడ్ చేసిన ఆ టెక్స్ట్ని వేరే వాళ్లతో పంచుకునేందుకూ అవకాశం కల్పించనుంది గూగుల్..

ఈ ఫీచర్‌ను ప్రత్యేకంగా రూపొందించారు..ఇకపోతే ఏ భాషలో ఉన్నా సరే ఆ సమాచారాన్ని మనకు కావాల్సిన భాషలోకి తర్జుమా చేసి చూపిస్తుంది. మీ మొబైల్ కెమెరానే ట్రాన్స్లేటర్గా పని చేస్తుందన్నమాట. ఎప్పుడు ఇది అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని గూగుల్ వెల్లడించలేదు. గూగుల్ లెన్స్ ఫీచర్ AI టెక్నాలజీతో పని చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్ను ఎక్కువగా వినియోగిస్తోంది భారత్లోనే..గూగుల్ ఇటీవల తన వార్షిక ఇయర్ ఇన్ సెర్చ్ రిపోర్ట్ 2022ని విడుదల చేసింది. ఈ నివేదికలో ప్రస్తుతం జరుగుతున్న ఈవెంట్లకు సంబంధించిన కొన్ని ప్రముఖ సెర్చ్ల వివరాలు షేర్ చేశారు.. అంటే ఇక భారత్ లో ఎంత కష్టంగా ఉంటుందో..

Read more RELATED
Recommended to you

Latest news