ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. ఏపీలోని ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది చంద్రబాబు సర్కార్. ఏపీ లో నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం కానుంది. ఇవాళ విజయవాడ లోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం కానుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 475 కాలేజీల్లో జరిగే ఈ కార్యక్రమం కోసం సర్కారు… 115 కోట్లు కేటాయించింది. ఇక ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఇక ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం కానున్న నేపథ్యంలో… ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.