తూర్పుగోదావరి జిల్లాలో గేమ్ ఛేంజర్ హడావిడీ స్పష్టంగా కనిపిస్తోంది. నేడు రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. రాజమండ్రి శివారుజాతీయ రహదారి పక్కన వేమగిరి గ్రౌండ్ లో భారీగా గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హీరో రామ్ చరణ్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
గ్రౌండ్ ని పలుసార్లు తనిఖీలు చేస్తున్నారు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, అధికారులు. సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో అభిమానులు జాగ్రత్త వహించాలని అంటున్నారు మెగా ఫాన్స్, నాయకులు. అటు గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకులు శంకర్ , నిర్మాత దిల్ రాజ్ పాల్గొననున్నారు. ఈ మేరకు పోలీసులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. చరణ్ హీరో గా చేసిన గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10వ తేదీన రిలీజ్ కానుంది.