అదిరే స్కీమ్.. రూ. 6 ఇన్వెస్ట్ చేస్తే రూ.లక్ష ఇన్సూరెన్స్‌…!

-

చాలా మంది ఎన్నో స్కీమ్స్ లో డబ్బులని పెడుతూ వుంటారు. అయితే భవిష్యత్తు లో ఏ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాంటి స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ ఉండాలి. ఇండియన్‌ పోస్టాఫీస్‌ చిన్నారుల కోసం కూడా స్కీమ్ ని తీసుకు వచ్చింది. ఇక ఆ స్కీమ్ కోసం పూర్తి వివరాలని చూస్తే.. బాల్ జీవన్‌ బీమా పేరుతో చిన్నారుల కోసం పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ని తీసుకు వచ్చింది.

కేవలం రూ. 6 పెట్టుబడిగా పెడితే రూ. లక్ష ఇన్సూరెన్స్‌ను పొందడానికి అవుతుంది. 8 నుంచి 12 ఏళ్ల వయసున్న చిన్నారులు కోసం ఈ స్కీమ్ ని తీసుకోవడానికి అర్హులు. చిన్నారులు అకాలంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఈ పాలసీ ఉపయోగ పడుతుంది. చిన్నారి 18 ఏళ్ల వయసు వచ్చే వరకు కవర్‌ అవుతుంది ఇది. చిన్నారి 18 ఏళ్ల లోపు మరణిస్తే వారి వాళ్ళ ఫ్యామిలీ కి లక్ష ఇన్సూరెన్స్‌ లభిస్తుంది.

రోజుకు రూ. 6 చొప్పున నెలకు రూ. 180 డిపాజిట్‌ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఇక ఈ స్కీమ్ ని ఎలా పొందొచ్చు అనేది చూస్తే.. బాల్‌ జీవన్‌ బీమా పాలసీని పొందడానికి దగ్గర లో వున్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి సంప్రదిస్తే సరిపోతుంది. మీరు ఫామ్‌ను తీసుకొని చిన్నారి పేరు, వయసు, చిరునామా తో పాటు నామినికి సంబంధించిన వివరాలను కూడా సబ్మిట్ చెయ్యాలి.

Read more RELATED
Recommended to you

Latest news