మరో సారి నోటి దురుసు ప్రదర్శించిన రష్మిక..!

-

గతంలో కర్నాటక లో కాంతారా సినిమా విషయంలో రష్మిక మీద విపరీతమైన ట్రోల్స్ నడిచిన సంగతి తెలిసిందే.. ఇక ఆమె సినిమాలను బ్యాన్ చేయాల్సిందిగా టాక్ నడుస్తోంది. రిషిబ్ శెట్టి తీసిన కాంతారా సినిమాని అందరూ పొగుడుతున్నా కాని, కన్నడ హీరోయిన్ అయ్యి ఉండి కూడా ఇప్పటివరకు సినిమా చూడలేదని తాపీగా చెప్పడంతో కన్నడ ప్రజలు మండి పడుతున్నారు. అదీ కాక ఫేమ్ వచ్చిన తర్వాత కన్నడ సినిమా వైపు చూడటం లేదని ఆమె పై కోపంతో ఉన్నారట. దీనితో ఆమెను బ్యాన్ చేయాల్సిందిగా కోరుతున్నారంటే ఆమె మీద ఎంత కోపం తో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

అయితే కాంతర సినిమా వివాదం గురించి  రస్మిక వివరణ ఇచ్చుకుంటూ తాను ఎవర్నీ అవమానించ లేదని తెలిపింది. దానితో చాలా మంది ఆ వివాదాన్ని మరచి పోయారు. ఇక మళ్లీ అలాంటి మరో సారి వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం ఆమె పోకస్ సౌత్ ఇండియా మరియు బాలీవుడ్ మధ్య కంపేర్ చేసి సౌత్ ను తక్కువ చేసేలా మాట్లాడింది.

రీసెంట్ గా రష్మిక  మాట్లాడుతూ… రొమాంటిక్ సాంగ్స్ అనగానే బాలీవుడ్ గుర్తుకు వస్తుంది. చిన్నప్పటి నుండి నేను బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ వింటూ పెరిగాను. సౌత్ చిత్రాల్లో ఈ తరహా రొమాంటిక్ సాంగ్స్ ఉండవు. అక్కడంతా మాస్ మసాలా ఐటెం సాంగ్స్ మాత్రమే ఉంటాయి అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనితో గతంలో కన్నడ ఫ్యాన్స్ మాత్రమే విరుచుకు పడితే ఇప్పుడు తెలుగు, తమిళ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news