రంగా ఇష్యూ..బోండా వర్సెస్ దేవినేని..హీటెక్కిన బెజవాడ.!

-

ఇటీవల వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమాలపై పెద్ద ఎత్తున రాజకీయం నడిచిన విషయం తెలిసిందే. అటు వైసీపీ, ఇటు టీడీపీ, మధ్యలో జనసేన పోటాపోటిగా రంగా వర్ధంతి కార్యక్రమాలని నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇదే క్రమంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. రంగాని హత్య చేసి చంపింది టీడీపీనే అని, చంద్రబాబు ప్రధాన పాత్ర ఉందని కొడాలి నాని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇక దీనికి కౌంటరుగా రంగాని చంపిన వారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో కొడాలి తెలుసుకోవాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

వంగవీటి మోహనరంగా చనిపోయినప్పుడు దేవినేని నెహ్రూ పక్కనే ఉన్నారని.. రంగా హత్య జరిగినప్పుడు నెహ్రూ వద్దే కొడాలి నాని ఉన్నారని బోండా ఉమా ఆరోపించారు. ఇక అంతటితో ఆగకుండా బెజవాడలో  దేవినేని అవినాష్ దందాలు చేస్తున్నారని, ఈ దందాలను ప్రోత్సహిస్తుంది ముఖ్యమంత్రి జగన్ అని, దేవినేని అవినాష్ విజయవాడలో వ్యభిచార గృహాలు, మసాజ్ పార్లర్లు, సెటిల్‌మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు.

దీంతో దేవినేని అవినాష్ స్పందిస్తూ..బోండాకు గట్టి కౌంటర్లు ఇచ్చారు. బోండా ఉమా ఒక చిల్లర వ్యక్తి, బజారు మనిషి అని, బెజవాడకు గంజాయి అలవాటు చేసిన వ్యక్తి బోండా ఉమా అంటూ విమర్శలు చేసారు. కోగంటి సత్యం, ఐలాపురం వెంకయ్య దగ్గర డ్రైవర్‌గా పని చేసి వాళ్లను మోసం చేసిన వ్యక్తి బోండా ఉమా, టీడీపీ ప్రభుత్వంలో అనేక అక్రమాలు చేశారని ఆరోపించారు.

దేవినేని నెహ్రూ చనిపోయి ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆయనను టార్గెట్ చేస్తున్నారని, ఇకపై దేవినేని నెహ్రూ పేరు ప్రస్తావిస్తే లీగల్ గా ముందుకు వెళ్తామన్నారు. ఇలా దేవినేని, బోండాల మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే రెండు పార్టీల రాజకీయ లబ్ది పొందడానికే రంగా ఇష్యూని వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news