మీ భాగస్వామితో ఈ అబద్దాలు చెప్పారంటే… ప్రేమని పెంచుకోవచ్చు తెలుసా..?

-

వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ప్రేమని పెంచుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని అబద్ధాలని చెప్పడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. మరి ఎటువంటి అబద్ధాలుని చెబితే భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. మామూలుగా ఎవరితో కూడా అబద్ధాలు చెప్పకూడదు. భార్య భర్తల మధ్య ప్రేమికుల మధ్య కూడా అబద్ధాలు చెప్పుకోకూడదు. కానీ ఈ అబద్ధాలు అని చెప్పడం వలన ప్రేమ తరిగిపోదు. ప్రేమ పెరుగుతుంది.

 

వంట రుచి బాగుందనడం

ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి వంట సరిగ్గా చేయకపోయినప్పటికీ కూడా భర్త వంట రుచి చాలా బాగుందని అబద్ధం చెప్తే ప్రేమ పెరుగుతుంది. ఒకవేళ కనుక బాగా లేదని చెప్తే ఆమెకే కోపం వస్తుంది పైగా ఆమె కష్టమంతా వృధా అవుతుంది.

బహుమతి నచ్చిందని చెప్పడం

ఒకవేళ కనుక పార్ట్నర్ లో ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే నచ్చకపోయినప్పటికీ నచ్చింది అని చెబితే వాళ్ళు హ్యాపీ అవుతారు మీ కోసం ఎంతో ఆలోచించి కొని ఉంటారు కాబట్టి నచ్చకపోయినా కాస్త నవ్వుతూ నచ్చిందని చెప్పండి. అప్పుడు మీ మధ్య బంధం బాగుంటుంది.

వాళ్ళు చెప్పింది సరే అనడం

ఒక్కొక్కసారి ఇతరులు చెప్పింది మీకు నచ్చకపోవచ్చు కానీ వాళ్ళు చెప్పిన దానికి సరే అని మీరు అబద్ధం చెప్తే మీ మధ్య బంధం బాగుంటుంది. ప్రేమ పెరుగుతుంది.

కొత్త వాటిని ప్రయత్నించినప్పుడు అభినందించండి

మీ జీవిత భాగస్వామి కనుక కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే వాళ్ళకి సెట్ అవ్వకపోయినప్పటికీ బాగుందని చెప్పండి. దీనితో వాళ్లు ఆనందంగా ఫీల్ అవుతారు కాబట్టి ఒక్కొక్కసారి ఇలాంటి అబద్ధాలు చెప్పినా కూడా మీ మంచికే. ప్రేమా పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news