ఆచార చాణక్య ఎన్నో ముఖ్యమైన విషయాలను చెప్పారు వీటిని కనుక మనం అనుసరిస్తే జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అవుతుంది. అయితే కొన్ని తప్పులు చేయడం వలన జీవితంలో పశ్చాత్తాప పడాల్సి వస్తుందని ఆచార్య చాణక్య చెప్పారు మరి ఎటువంటి తప్పులను చేయడం వలన పశ్చాత్తాప పడాల్సి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
డబ్బుకి విలువ ఇవ్వకపోవడం:
చాలా మంది డబ్బుకి విలువ ఇవ్వరు. ఇష్టానుసారంగా ఖర్చు పెడుతూ ఉంటారు కానీ నిజానికి డబ్బులని ఇష్టానుసారంగా ఖర్చు చేయకూడదు అవసరానికి మాత్రమే ఖర్చు చేయాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. డబ్బులు వృధా చేయడం వలన జీవితంలో పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. లక్ష్మీదేవి దూరం అవుతుంది.
చెడు అలవాట్లు:
చెడు అలవాట్లు కలిగిన వాళ్లు కూడా ఏదో రోజు జీవితం లో ఇబ్బందుల్లోకి వెళ్లిపోతూ ఉంటారు అప్పుడు తిరిగి బాధపడుతూ ఉంటారు. అయ్యో అనవసరంగా చెడు అలవాట్లకి బానిస అయిపోయాను అని..
సమయాన్ని వృధా చేయడం:
సమయాన్ని వృధా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు ఎప్పుడూ కూడా మీ సమయాన్ని వృధా చేసుకోకండి ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుని సమయానికి విలువ ఇవ్వండి.
స్త్రీలని అవమానించకండి:
స్త్రీలను ఎప్పుడు అవమానించకూడదు స్త్రీలని అవమానిస్తే లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉండదు కాబట్టి ఎటువంటి తప్పులు చేయద్దు తర్వాత జీవితంలో మీరే పశ్చాతాప పడాల్సి వస్తుంది.