ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువగా డయాబెటిస్, బీపీ తో బాధ పడుతున్నారు చాలా మంది డయాబెటిస్ బీపీ కి సంబంధించిన ట్రీట్మెంట్ ని తీసుకుంటున్నారు. రెగ్యులర్ గా టాబ్లెట్లను కూడా వాడుతూ ఉంటారు. అలానే ఈ మధ్య కాలం లో పక్షవాతం సమస్య కూడా విపరీతంగా పెరిగి పోతోంది. ముఖ్యంగా నలభై ఐదు ఏళ్లలో ఈ సమస్య బాగా పెరిగింది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నలభై ఐదు ఏళ్ల వారి లో 24 శాతం మందికి ఈ సమస్య వస్తుందని తెలుస్తోంది కాబట్టి పక్షవాతం సమస్య రాకుండా జాగ్రత్త పడాలి, లేదంటే లేని పోని ఇబ్బందులు తర్వాత ఎదుర్కోవాల్సి వస్తుంది.
పక్షవాతం లక్షణాలు ఇవే:
శరీర భాగం లో తిమ్మిరి ఎక్కడం
స్పర్శ లో తేడా రావడం
వణుకు, కంటి చూపు తగ్గడం ఇవన్నీ కూడా పక్షవాతానికి లక్షణాలే. ఇటువంటి లక్షణాలు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్లడం మంచిది.
ఈ జాగ్రత్తలని తప్పక తీసుకోండి:
షుగర్ బీపీ ని చెక్ చేయించుకోండి:
షుగర్, బీపి సమస్య తో బాధపడే వాళ్ళు షుగర్ బీపీ ని రెగ్యులర్ గా చెక్ చేయించుకుంటూ ఉండండి అప్పుడు ఈ సమస్య రాకుండా మీరు జాగ్రత్త పడడానికి అవుతుంది. బీపీ అసలు పెరిగిపోకుండా చూసుకోవాలి.
వర్కౌట్స్ చేయండి:
మీ రోజు లో కాస్త సమయాన్ని వ్యాయామానికి కేటాయించండి. వాటికి దూరంగా ఉండటం మంచిది.
పక్షవాతానికి ట్రీట్మెంట్ ఏంటి..?
పక్షవాతం వచ్చిన వారికి త్వరగా ట్రీట్మెంట్ చేయాలి. బాడీ కదలకుండా ఉంటే వారికి పుండ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం ఉండదు.