తన అడ్డా అయిన సీడెడ్ లో అదర గొట్టిన బాలయ్య .!

-

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా తాజాగా జనవరి 12న విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎక్కడా చూసినా బాలయ్య అభిమానుల హంగామా మాత్రమే కనపడింది. ఇక థియేటర్స్ దగ్గర చూస్తే ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.

ఇక సినిమాలోని పాటలు సన్నివేశాలు, డైలాగ్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. ఇక బాలయ్య బాబు చెప్పిన డైలాగ్స్ అయితే థియేటర్లలో అభిమానులను విజిల్స్ కొట్టించాయి. ఈ వయసులో కూడా అదే ఎనర్జీతో అంతే ఎనర్జిటిక్ గా బాలయ్య బాబు డైలాగులు చెప్పడంతో అభిమానులు అవధులు లేకుండా పోయాయి. ఆ డైలాగ్స్ కూడా గవర్నమెంట్ కు టార్గెట్ చేసినట్లు గా కనపడింది.

ఇక బాలయ్య బాబు కలెక్షన్స్ కు అయుపట్టు లాగా ఉండే సీడెడ్ మరో సారి తన దైన శైలిలో వసూళ్ళు వర్షం కురిపించాయి. సీడెడ్ లో వీరసింహా రెడ్డి సెన్సేషనల్ వసూళ్లు మొదటి రోజు కొల్లగొట్టినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఈ చిత్రానికి అక్కడ మొదటి రోజే 6 కోట్లకి పైగా షేర్ రాబట్టినట్టుగా తెలుస్తుంది. దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాలి కానీ మరోసారి బాలయ్య మాత్రం తన స్టామినా చూపించారని ఫ్యాన్స్ మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news