పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో కలకలం..ఐపీఎల్‌ గెటప్‌ లో వచ్చి !

-

పార్వతీ పురం మన్యం జిల్లా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో కలకలం చోటు చేసుకుంది. పార్వతీ పురం మన్యం జిల్లా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఐపీఎస్ యూనిఫారంతో వచ్చిన సూర్య ప్రకాష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు విజయనగరం పోలీసులు. సూర్య ప్రకాష్ ది విజయనగరం జిల్లా ముడిదాం ప్రాంతంగా గుర్తించారు. గత ఏడాదే ఐపీఎస్ కు సెలక్ట్ అయ్యానని స్థానికులకు చెప్పిన సూర్యప్రకాస్.. ట్రైనింగ్ లో ఉండి పవన్ కళ్యాణ్ పర్యటన కోసం వచ్చానని చెబుతున్నారు.

pawan

తన సొంత కారు ఇంటి వద్దనే విడిచిపెట్టి వేరే కారులో విజయనగరం నుంచి హైదరాబాదు వెళ్తేందుకు ప్రయత్నించాడు సూర్యప్రకాస్. అయితే… విజయనగరం సరిహద్దులో సూర్యప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక అటు సూర్యప్రకాష్ ను ఎస్కేప్ చేసేందుకు సహకరించారు స్థానిక ఏఆర్ కానిస్టేబుల్. తన వాహనాన్ని కూడా ఆ కానిస్టేబుల్ ఇంటి వద్దనే విడిచిపెట్టాడు సూర్యప్రకాష్. దీంతో అతను ఐపీఎస్ అధికారా కాదా అని వివరాలు సేకరిస్తున్నారు విజయనగరం పోలీసులు.. సూర్య ప్రకాష్ గతంలో పార్వతీపురం డివిజన్ తూనుకలు కొలతలు విభాగంలో లైసెన్స్డ్ రిపేరర్ గా పని చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news