సీనియర్ హీరోయిన్ ప్రియమణి గురించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ సినిమాలలో కూడా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె ఒకవైపు సినిమాలలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినప్పటికీ.. మరొకవైపు బుల్లితెర షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఇకపోతే టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
ఇకపోతే స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈమె పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయింది. కానీ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ నారప్ప సినిమాతో ప్రారంభించి.. బిజీగా మారిన ఈమె ముస్తఫా రాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ముస్తఫా రాజ్ కు ప్రియమణితో కాకుండా ఇదివరకే పెళ్లయిన విషయం తెలిసిందే.అయినా కూడా ప్రియమణి ఇతడిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. అయితే వీరి పెళ్లి జరిగి ఏళ్లు గడుస్తున్నప్పటికీ వీరికి పిల్లలు లేకపోవడం గమనార్హం. ఇప్పటికే వివాహాలు చేసుకున్న ఎంతోమంది సెలబ్రిటీలుపెళ్లి సంవత్సరం కూడా గడవకముందే బిడ్డతో దర్శనమిస్తున్నారు. అయితే ప్రియమణి మాత్రం అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పకపోవడం అభిమానులను మరింత నిరాశకు గురిచేస్తుంది.
నిజానికి ప్రియమణి భర్త ముస్తఫా రాజ్ కు పిల్లలు అంటే చాలా ఇష్టం. కానీ ప్రియమణి మాత్రం ఇప్పుడే పిల్లలు వద్దని భర్తకు చెప్పిందట. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఒక వైపు సినిమాలు.. మరొకవైపు వెబ్ సిరీస్ లో బిజీగా ఉన్న ఈమె ఇలాంటి సమయంలో పిల్లల గురించి ఆలోచిస్తే తన బాడీ ఫిజిక్ మొత్తం మారిపోతుందని.. అంతేకాకుండా సినిమాలలో కూడా అవకాశాలు తగ్గిపోతాయని.. అందుకే ఇప్పుడే పిల్లలు వద్దని భర్తకు చెప్పిందట ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే ఈ విషయం అభిమానులను మరింత నిరాశకు గురి చేసిందని చెప్పవచ్చు.