60ల్లో కూడా నువ్వు సూపర్ బాసూ.. ఈ వీడియో చూస్తే బాలయ్య ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే..!

-

టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన అనతి కాలంలోనే స్టార్ హీరోగా మారి ఎన్నో చిత్రాలలో నటించి మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇకపోతే సినిమా మీద మక్కువతో ఆరు పదుల వయసు దాటినా కూడా వరుసగా సినిమాలు చేస్తూ కొత్త హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలు కోట్లు కొల్లగొడుతుంటే వారికి పోటీగా సీనియర్ స్టార్ హీరో బాలయ్య కూడా వరుసగా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడు.

తాజాగా బాలయ్య కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు అలాగే సినీ ప్రేక్షకులు, ప్రజలు కూడా 60 ల్లో కూడా మీరు ఇంత ఫిట్నెస్ గా ఉండడం నిజంగా గ్రేట్ బాసూ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇంతకు ఆ వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే ఎర్లీ మార్నింగ్ బాలకృష్ణ పోలీసులతో సహా జాగింగ్ చేస్తూ ఆ తర్వాత భోగిమంటలతో ప్రతి ఒక్కరికి భోగి పండుగ శుభాకాంక్షలు వెల్లడించారు.

నిజానికి బాలయ్య 60ల్లో కూడా ఇంత ఫిట్నెస్ గా ఉన్నారు అంటే ఆయన చేసే జాగింగ్ , వాకింగ్ లాంటిదే ఆయనను మరింత ఫిట్నెస్ గా మారుస్తున్నాయని చెప్పవచ్చు. ఇకపోతే బాలయ్య అంత పొద్దున్నే అందులోనూ చలిలో ఆయన ఈ వయసులో కూడా జాగింగ్ చేస్తున్నారు అంటే నిజంగా ఆయన డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం బాలయ్యకు సంబంధించిన ఈ వీడియో బాగా వైరల్ గా మారింది అంతేకాదు ఈయన నటించిన వీర సింహారెడ్డి సినిమా కూడా భారీ విజయాన్ని అందించింది.

Read more RELATED
Recommended to you

Latest news