హైదరాబాద్ లో హనీ ట్రాప్ ముఠా గుట్టురట్టు

-

హైదరాబాద్ లో హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఓ మహిళతో పాటు తొమ్మిది మందిని అరెస్టు చేశారు సెంట్రల్ జోన్ పోలీసులు. హోమ్ డెలివరీ పేరుతో హనీ ట్రాప్ చేస్తుంది ఆ మహిళ. కొందరు యువకులతో పరిచయాలు పెంచుకొని ఫోటోలు దిగుతూ ఆ మరుసటిరోజే ఈ గ్యాంగ్ తో ఇంటి ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ తరువాత యువకుల ఇంటిపై వారి ముఠాతో దాడులకు పాల్పడుతుంది.

ఆ తర్వాత యువకుల నుంచి లక్షలలో డబ్బులు వసూలు చేస్తుంది. ఈ ముఠాని ముషీరాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. హైదరాబాదులో వరుసగా హనీ ట్రాప్ కి పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూడడంతో పోలీసులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఒక సెంట్రల్ జోన్ లోనే ఆరు కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news