ఈ మధ్య కాలం లో ప్రతి ఒక్కరూ వాస్తుని అనుసరిస్తున్నారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ ఇబ్బంది ఉండదని వాస్తుకు తగ్గట్టుగా ఫాలో అవుతున్నారు. మీరు కూడా వాస్తు ని అనుసరిస్తూ ఉంటారా..? అయితే కచ్చితంగా ఈ టిప్ ని కూడా మీరు చూడాల్సిందే. ఈరోజు వాస్తు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలని పంచుకున్నారు. మరి వాటి కోసమే ఇప్పుడు చూద్దాం.
ఇంట్లో అగర్బత్తిని వెలిగిస్తే నెగటివ్ ఎనర్జీ దూరం అయ్యి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అందుకని ప్రతి రోజు తప్పని సరిగా చాలా మంది అగరబత్తిని వెలిగిస్తారు. ఆనందంగా ఉండడానికి అవుతుంది. అలానే హానికరమైన బ్యాక్టీరియా వంటివి తొలగిపోయి ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే ప్రతి రోజూ అగరబత్తిని వెలిగిస్తున్నట్లయితే ఈ అలవాటుని మార్చుకోండి ఎందుకంటే అగరబత్తిని మంగళవారం నాడు ఆదివారం నాడు వెలిగించకూడదు.
మంగళవారం నాడు ఆదివారం నాడు అగరబత్తిని వెలిగించడం వలన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అలానే ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సమస్యల్ని కూడా ఇది తీసుకువస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పును చేయొద్దు. ఇలా ఈ విధంగా మీరు అనుసరిస్తే ఏ బాధ లేకుండా ఉండొచ్చు. కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న తప్పులు మనల్ని ఇబ్బందుల్లో పడేస్తాయి పండితులు చెప్పిన ఈ చిట్కాని అనుసరించి ఏ బాధ లేకుండా పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉండండి.