బిజినెస్ ఐడియా: పేపర్ ప్లేట్లతో అదిరే లాభాలు.. పెట్టుబడి తక్కువే..!

-

ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో వ్యాపారాలని చేయడానికి చూస్తున్నారు. మీరు కూడా ఏదైనా మంచి వ్యాపారాన్ని చూడాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ ఐడియా ని అనుసరించండి. పేపర్ ప్లేట్ల ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. పేపర్ ప్లేట్లను చాలా మంది ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇళ్లల్లోనే కాక రెస్టారెంట్లు క్యాంటీన్లో ఆఫీస్ లలో కూడా వాడితో ఉంటారు. ఏవైనా పార్టీలో ఫంక్షన్ లో అయినా సరే వాడుతూ ఉంటారు.

వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు ఎటువంటి సందేహపడక్కర్లేదు. పైగా ఈ పేపర్ ప్లేట్లు లో రకాలు కూడా ఉంటాయి మీరు మీకు నచ్చిన దానిని అమ్మొచ్చు. అలానే కప్పులను కూడా తయారు చేసి అమ్మచ్చు.

తక్కువ బడ్జెట్ తోనే మీరు ఈ బిజినెస్ ని మొదలు పెట్టొచ్చు ఎక్కువ స్థలం కూడా అక్కర్లేదు. కొంచెం స్థలం ఉంటే సరిపోతుంది. అయితే ఈ వ్యాపారం చేయడానికి మీకు లైసెన్స్ కావాలి స్థానిక అధికారం నుండి అనుమతి కానీ NOC ని కానీ తీసుకోవాలి ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి 25వేల రూపాయలు కంటే తక్కువ ఉన్న చాలు.

మిషన్ ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది మాన్యువల్ కానీ ఆటోమేటిక్ మిషన్స్ కానీ మీరు కొనుగోలు చేయొచ్చు. అలానే పేపర్ ప్లేట్లను తయారు చేయడానికి పేపర్ షీట్ రోల్ కావాలి ఒక పేపర్ షీట్ రోల్ మీకు కిలోకు కనీసం 30 నుండి 40 రూపాయలు కి వస్తుంది. 100 ప్లేట్ల ప్యాకెట్ మీరు 80 రూపాయలకి అమ్మొచ్చు. ఒక పేపర్ ప్లేట్ తయారు చేయడానికి కేవలం 80 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇలా మీరు ఈ బిజినెస్ ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిస్క్ కూడా ఉండదు. ఇలా అదిరే లాభాలని మీరు పేపర్ ప్లేట్ల ద్వారా మీరు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news