వామ్మో.. ఈ హీరో పారితోషకం రోజుకు రూ.2 కోట్లా..?

-

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చాలామంది సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి కష్టపడి పైకి ఎదిగి స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అటువంటి వారిలో బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా ఒకరు. గత ఏడాది భూల్ భులయ్య 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈయన ఈ సినిమా బాలీవుడ్ లో ఒక్కసారిగా ఆర్యన్ ను సెన్సేషనల్ స్టార్ హీరోగా మార్చింది. ఇటీవల ఆయన పారితోషకం విషయం కూడా ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే మొదటి సినిమాకు రూ.1.75 లక్షలు పారితోషకం తీసుకున్న కార్తీక్ ఆర్యన్ తాజాగా ఒక సినిమాలో పది రోజులు నటించినందుకుగాను ఏకంగా రూ.20 కోట్ల పారితోషకం తీసుకున్నాడు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీక్ ఆర్యన్ తాను తీసుకున్న పారితోషకం విషయంపై మాట్లాడుతూ.. నేను కరోనా సమయంలో నటించినప్పుడు ఆ సినిమాకు రూ.20 కోట్ల పారితోషకం తీసుకున్న మాట వాస్తవమే. నేను ఆ సినిమాను కేవలం పది రోజుల్లోనే పూర్తి చేశాను. దీనివల్ల నిర్మాతలకు కూడా మంచి లాభం వచ్చింది. కాబట్టి ఆ స్థాయిలో పారితోషకం తీసుకోవడంలో ఎలాంటి తప్పులేదు కదా అని కార్తీక్ ఆర్యన్ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే ఒక రోజుకు 2 కోట్ల రూపాయలు చొప్పున పారితోషకం తీసుకున్నాడు అంటూ వస్తున్న వార్తలు నిజమని చెప్పవచ్చు.

దీంతో ఈ యంగ్ హీరో క్రేజ్ చూసి అభిమానులు, నెటిజెన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురంలో సినిమా హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news