రాజమౌళి వ్యాఖ్యల ను ఫాలో అవుతున్న పఠాన్ డైరెక్టర్.!

-

షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ బాక్సాఫీస్ వద్ద సునామీగా మారిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పఠాన్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన షారుక్ ఖాన్ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఎన్నాళ్ళ నుండో బాలీవుడ్ వారు వెయిట్ చేస్తున్న విజయం లభించింది అని సంబరాలు చేసుకుంటున్నారు.

దీపికా పడుకునె, జాన్ అబ్రహం ఇతర ప్రధాన తారాగణంతో తెరకెక్కిన పఠాన్ సినిమా అన్ని చోట్లా అన్ని రకాల భాషల్లో మల్టీప్లెక్స్‌, సింగిల్ స్క్రీన్ తేడా లేకుండా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ పఠాన్ చిత్రం తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇప్పటి వరకు 580 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం లాంగ్ రన్ లో ఊహించని రీతిలో వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక ఈ సినిమా దర్శకుడు సిద్ధార్ద్ ఆనంద్ గతంలో రాజమౌళి చెప్పిన సంగతి ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. రాజమౌళి గతంలో సినిమా హిట్ కావాలంటే ఖచ్చితంగా స్క్రిప్ట్ వర్క్ పక్కాగా ఉండాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సిద్ధార్థ్ ఆనంద్ కూడా కొత్త రికార్డుల గురించి మాట్లాడుతూ- ఇక పఠాన్ సక్సెస్ వెనక కథా బలంతో పాటు.. ఎమోషన్ అందరికీ కనెక్టయిందని అతడు తెలిపాడు. “సినిమా అనేది ఎమోషన్ కు సంబంధించినది… భాష తో పని లేదని ఎప్పుడూ నమ్ముతాను. కథలో ఎమోషన్ హిట్ చేకూరుస్తుంది అని అన్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news