చేతనైతే హుజూరాబాద్ కు మెడికల్ కాలేజీ తీసుకురా : కేటీఆర్‌

-

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో భారత రాష్ట్ర సమితి నిర్వహించిన బహిరంగసభలో మంత్రి కేటీఆర్ తోపాటు ఇతర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గుంగుల కమలాకర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్‌. బండిసంజ్‌.. తవ్వుదాం రా… హుజూరాబాద్ లో కాలువల కోసం పునాదులు తవ్వుదాం రా. దమ్ముంటే రా…. హుజూరాబాద్ లో కొత్త పరిశ్రమలు పెట్టేందుకు పునాదులు తవ్వుదాం! హుజూరాబాద్ లో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం పునాదులు తవ్వుదాం… దమ్ముంటే మోదీని ఒప్పించి నాలుగు పైసలు తీసుకురా! అంటూ వ్యాఖ్యానించారు మంత్రి కేటీఆర్‌. అంతేకాకుండా.. ఇవేవీ చేతకావు కానీ… గట్టిగా మాట్లాడితే మెమ్మెమ్మె… బెబ్బెబ్బె.. హిందూస్థాన్ పాకిస్థాన్… హిందూ ముస్లిం అంటాడు.

Notification for jobs in 6-9 months: KTR - Telangana Today

బండి సంజయ్ గారూ… ఈ నాలుగున్నరేళ్లలో ఎంపీగా మీరు, ఈ 14 నెలల కాలంలో ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ హుజూరాబాద్ కు ఏంచేశారో చెప్పే దమ్ముందా? తెల్లారిలేస్తే సొల్లుమాటలు చెబుతూ కేసీఆర్ ను తిట్టడంకాదు… చేతనైతే హుజూరాబాద్ కు మెడికల్ కాలేజీ తీసుకురా, చేతనైతే నవోదయ పాఠశాల తీసుకురా, చేతనైతే కరీంనగర్ కు ఓ ట్రిపుల్ ఐటీ తీసుకురా! ఇవి తీసుకువస్తే నీకు సన్మానం చేస్తాం. ఇవేవీ చేతకావు కానీ మతం పేరిట చిచ్చుపెట్టడంలో మాత్రం సిద్ధహస్తులు” అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “పెద్దలు చెబుతారు… వెట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలంటారు. ఇవాళ తెలంగాణలో మన పార్టీ అంటే ఒకే ఒక్క భారత రాష్ట్ర సమితి మాత్రమే తప్ప ఈ గుజరాతోళ్ల బీజేపీ కానే కాదు. ఈ గుజరాత్ వాళ్లకు గులాంగిరీ చేయడం బండి సంజయ్ కు ఇష్టమేమో, ఈ గుజరాత్ వాళ్ల చెప్పులు నెత్తిమీద పెట్టుకునే అలవాటు ఆయనకు ఉండొచ్చు. కానీ వాళ్లకు గులాంగిరీ చేసే అవసరం మాకు లేదు” అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

Read more RELATED
Recommended to you

Latest news