కోటంరెడ్డి వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటర్

-

తన ఫోన్ ట్యాప్ చేశారంటూ సొంత పార్టీపై ఆరోపణలు చేసి పార్టీకి రాజీనామా చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి. ఫోన్లు టాప్ చేసే అలవాటు చంద్రబాబు నాయుడుకి ఉందని విమర్శించారు. ఫోన్ ట్యాప్ చేయాల్సిన కర్మ ఎవరికి పట్టలేదు అన్నారు. పార్టీ మారాలనుకున్నాడు కాబట్టే ఫోన్ టాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి కంటే సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారని చెప్పారు కొడాలి నాని. చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యే పరిస్థితి లేదని, ఇక వీళ్లకు మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లంతా పార్టీ నుంచి వెళితేనే మంచిదని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. అర్థం చేసుకోలేని నలుగురైదుగురు వెళ్ళిపోతే పార్టీకి ఎటువంటి నష్టం లేదన్నారు కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Latest news