ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. క్షుద్రశక్తులు కోసం మంత్రగాడిని చంపి రక్తం తాగిన వ్యక్తి

-

సమాజం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. ఆధునక పరిజ్ఞానంతో ఎన్ని ఆవిష్కరణలు చేసినా.. కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా ముఢనమ్మకాలనే అంధకారంలోనే మగ్గిపోతున్నాయి. ముఖ్యంగా క్షుద్రశక్తుల కోసం చంపడమో.. చావడమో.. లాంటి పనులు చేస్తూనే ఉన్నారు కొందరు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్‌తరీ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. క్షుద్రపూజలు చేసే వ్యక్తిని అతడి శిష్యుడు దారుణంగా చంపాడు. అనంతరం అతడి రక్తం తాగాడు. పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేశారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం.. బసంత్‌ సాహు(50) అనే వ్యక్తి దగ్గర నిందితుడు రౌనక్‌ సింగ్‌ ఛబ్రా అలియాస్‌ మన్య(25) చావ్లా క్షుద్రపూజలు నేర్చుకుంటున్నాడు. బసంత్‌ను చంపి అతడి రక్తం తాగితే తనకు క్షుద్రపూజలు చేసే శక్తులు వస్తాయని భావించాడు. బసంత్‌ క్షుద్రపూజలు చేస్తుండగా అతడిపై దాడి చేసి చంపి రక్తం తాగాడు. అనంతరం మృతదేహానికి నిప్పుపెట్టాడు. పోలీసులు గురువారం పాక్షికంగా కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నిందితుణ్ని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news