పవన్ ‘హరిహర వీరమల్లు’ కొత్త​ స్టిల్స్​ చూశారా

-

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్​ సినిమా ‘హరి హర వీరమల్లు’. ఇందులో పవన్‌కల్యాణ్‌కి జోడీగా నిధి అగర్వాల్‌ నటిస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పిస్తున్నారు. ఇవాళ ఏఎం రత్నం బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ హరిహర వీరమల్లు టీమ్ ఓ స్పెషల్ ఫొటోను షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో ఏఎం రత్నం పవన్ కల్యాణ్‌తో కలిసి కూర్చొని ముచ్చటిస్తున్నారు. ఇద్దరు సరదాగా ఏదో మాట్లాడుతూ నవ్వుతూ కనిపించారు. ఈ ఫొటోలో పవన్ లుక్ చూసి ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఈ సినిమాలో పవర్ స్టార్ స్టైలిష్‌గా కనిపించబోతున్నారని మాట్లాడుకుంటున్నారు.

ఎ.ఎం.రత్నం విషయానికొస్తే.. మేక‌ప్ మెన్​గా కెరీర్ ప్రారంభించి.. ఆ త‌ర్వాత నిర్మాత‌గా మారారు. సూర్యామూవీస్ బ్యానర్​పై ఆయన నిర్మించిన చిత్రాలు, అనువదించిన సినిమాలు టాలీవుడ్​ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news