గుజరాత్లో స్వల్ప భూకంపం సంభవించింది. శుక్రవారం అర్థరాత్రి తరువాత భూప్రకంపనలు రావడంతో గాఢనిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.8గా నమోదైంది.
సూరత్ జిల్లాలో 12.52 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ అధికారులు తెలిపారు. సూరత్‌కు పశ్చిమ నైరుతి తీరాన 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు వారు వెల్లడించారు. ఇది హజీర జిల్లా సమీపాన.. అరేబియా సముద్రంలో ఉన్నట్లు గుర్తించారు. 5.2 కిలోమీటర్ల లోతులు భూకంపం సంభవించినట్లు పేర్కొన్నారు. ఘటన ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.