తెలంగాణ శాసనసభలో బడ్జెట్‌పై చివరి రోజు చర్చ జరుగుతోంది. ఇవాళ.. వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. గురుకుల కళాశాలల్లో వ్యవసాయ కోర్సులు ప్రవేశపెడితే… ఆ కాలేజీకి వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని.. అందు కోసమే తాజా సవరణ చేపట్టిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
అనంతరం పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. భద్రాచలాన్ని మూడు గ్రామాలు చేస్తూ సవరణ ప్రవేశపెట్టారు. నిబంధనల ప్రకారం భద్రచలాన్ని పురపాలక సంఘంగా మార్చే అవకాశం లేదని… అదే సమయంలో లక్ష వరకు జనాభా ఉంది కాబట్టి… ఒకే పంచాయతీగా ఉంచే అవకాశం లేదని… మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. భద్రాచలం గ్రామ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందని… పరిపాల సౌలభ్యం కోసం భద్రాచలాన్ని మూడు గ్రామ పంచాయతీలు చేసినట్లు ఎర్రబెల్లి స్పష్టంచేశారు.