BREAKING : తారకరత్న కోసం బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. కుప్పంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో భాగంగా తారకరత్న స్పృహ తప్పి పడిపోవడం తెలిసిందే.
హుటాహుటిన హాస్పిటల్ కు తరలించగా ఆయనకు గుండెపోటు వచ్చిందని వైద్యులు ప్రథమ చికిత్సలో భాగంగా నిర్ధారించారు. వెంటనే బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు తరలించి అక్కడ మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు.
ఇక ఇప్పటికి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తున్న బాలకృష్ణ… దగ్గరుండి చూసుకునేలా తన షూటింగ్లకు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. Nbk 108 షూటింగ్ కూడా లేటుగా ప్రారంభం కనుగొన్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఇప్పటికే తారకరత్న కోసం బాలయ్య మృత్యుంజయ స్వామి ఆలయంలో అఖండ జ్యోతి కార్యక్రమం చేపట్టారు.