మహాశివరాత్రి రోజు పాటించాల్సిన నియమాలు ఇవే !

-

మహా శివరాత్రి. అత్యంత పర్వదినం. శివరాత్రినాడు శివుడ్ని అర్చించని చేతులు చేతులు కావట. శివ, శివ అనని నోరు నోరు కాదట అన్నాడు పూర్వం ఒక మహా భక్తుడు. అంతేకాదు జన్మకో శివరాత్రి అంటారు. అలాంటి ఈ పర్వదినాన అనేక శివరాత్రి వ్రతం జరుపుకొనే విధానం గురించి గరుడపురాణంలో తెలియజేశారు. త్రయోదశి రోజు రాత్రి అల్ఫాహారం తీసుకోవాలి. ప్రాతఃకాలంలో తలస్నానం చేసి ‘హే మహాదేవా.. నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన, తప, హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండో రోజు మాత్రమే తింటాను.

ఆనంద, మోక్షాలను అనుగ్రహించు శివా!’ అని సంకల్పం చేసుకోవాలి. వ్రతం ఆరంభించిన తర్వాత శివాలయం వెళ్లి, పంచామృతాలు, పంచగవ్యాలతో ( ఆవు పేడ, ఆవు పంచకం, పాలు, పెరుగు, నెయ్యి) శివుడికి అభిషేకం చేయాలి. ఓం నమః శివాయ పంచాక్షరీ మంత్రం ఉచ్చరిస్తూ అభిషేకం నిర్వహించాలి. చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో శివుడ్ని పూజించి, అగ్నిలో నువ్వులు, బియ్యం, నెయ్యితో కలిపిన అన్నం వేయాలి. ఈ హోమం తర్వాత పూర్ణాహుతి నిర్వహించాలి. శివకథలు వింటూ మరొకసారి శివరాత్రి మూడు, నాలుగో జాములో మరోసారి ఆహుతులను సమర్పించాలి.

సూర్యోదయం వరకూ మౌనవ్రతం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. ‘పరమాత్మా! మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేశాను. హే లోకేశ్వరా! శివ, భవా! నన్ను క్షమించు… ఈ రోజు నేను ఆర్జించిన పుణ్యమంతా, మీకు అర్పించినదంతా మీ కృపతోనే పూర్తి చేశాను. హే కృపానిధీ! మా పట్ల ప్రసన్నులు కండి! మీ నివాసానికి వెళ్లండి. మీ దర్శనమాత్రం చేతనే మేము పవిత్రులమయ్యాం’ అని వేడుకోవాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news