టర్కీ, సిరియాల్లో మరణమృదంగం.. 72 వేలు దాటిన మరణాలు..7 లక్షల కోట్ల నష్టం

-

టర్కీ, సిరియాలో భూకంపం పెను విషాదం నింపింది. ఎటు చూసినా భవన శిథిలాలు, వాటి కింద కుళ్లిన మృత దేహాలు, భూకంప ధాటికి తీవ్రంగా గాయపడిన వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంత రక్తసిక్తమైంది. ఈ భూకంపం.. ఆ దేశాలకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. ప్రాణనష్టమే కాకుండా ఆస్తి నష్టం కూడా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈనెల 6న సంభవించిన భూకంపం వల్ల.. సుమారు రూ.6.95లక్షల కోట్ల నష్టం వాటిల్లి ఉండొచ్చని తుర్కియేలోని వాణిజ్య సంఘాలు అంచనా వేశాయి. ఇది ఆయా దేశాల జీడీపీలో 10శాతం కంటే ఎక్కువని పేర్కొన్నాయి. తీవ్ర భూకంపం ధాటికి ఒక్క టర్కీ లోనే 25,000 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా 42,000 ఇళ్లు కూలిపోవడమో లేదా అత్యవసరంగా కూల్చాల్సిన పరిస్థితి తలెత్తిందని తుర్కియే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మురాత్‌ కురుమ్‌ తెలిపారు.

మరణాల సంఖ్య కూడా భారీగా పెరగవచ్చని.. సుమారు 72,000 మంది ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని తాజా నివేదికలో వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news