బీ ఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకోక తప్పదని నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై బండి సంజయ్ స్పందించారు.కుట్రను కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బయట పెట్టారన్నారు బండి సంజయ్. ఎన్నికల తరవాత అధికారం పంచుకోవాలని కాంగ్రెస్ , BRS డిసైడ్ అయ్యాయి…ఈ రెండు పార్టీ లు కలిసి పోటీ చేస్తాయన్నారు.
పొత్తు పై మాట్లాడిన కోమటి రెడ్డి పై ఆ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేదు…రెండు పార్టీ లు ఒక్కటే… డ్రామాలు ఆడుతున్నాయని ఆగ్రహించారు.అధికారం పంచుకోవాలని అనుకుటుంటున్న కాంగ్రెస్ పార్టీ కి ఎందుకు ఓటు వేయాలన్నారు.
కొండగట్టు, వేములవాడకు ఇస్తా అని చెప్పిన నిధులు ఎక్కడ ? కొండగట్టు ప్రమాదంపై సీఎం కేసీఆర్ కనీసం స్పందించలేదనీ ఫైర్ అయ్యారు.కొండగట్టు ప్రమాద బాధితులకు కనీస సహాయం చేయడం లేదు..ఈ రోజు సీఎం కేసీఆర్ కొండగట్టుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.