తెలంగాణలో ప్రభుత్వ వైద్యానికే ప్రజల మద్దతు : మంత్రి ఎర్రబెల్లి

-

రాష్ట్ర బడ్జెట్ లో వైద్య, ఆరోగ్య శాఖకు భారీగా కేటాయింపులు చేశారని తెలంగాణ పంజాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. విద్య, వైద్య రంగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పారు. హైదరాబాద్ నగరానికి నలుదిక్కులా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వరంగల్ లో రూ. 11 వందల కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మిస్తోందని చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని… అందుకే ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని అన్నారు. ప్రైవేట్ వైద్యులు కూడా కేవలం వ్యాపార ధోరణితో మాత్రమే ఆలోచించకుండా సేవా ధృక్పథంతో సేవ చేయాలని చెప్పారు. వరంగల్ జిల్లా ఆరేపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాల వల్ల ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. ప్రైవేట్‌ వైద్యులు వ్యాపార దృక్ఫథమే గాక సేవా దృక్ఫథంతో పేదలకు సేవ చేయాలని సూచించారు. వరంగల్‌ నగరం ఐటీ, టెక్ట్స్‌టైల్స్‌ పార్కులు ఏర్పాటవుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు చల్లా ధర్మా రెడ్డి, అరూరి రమేశ్, మేయర్ గుండు సుధారాణి, ఉమ్మడి వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మా రావు తదితరులు ఆస్పత్రిలోని పలు విభాగాలను ప్రారంభించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news