విశాఖ-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ 3 గంటలు ఆలస్యం

-

హైదరాబాద్‌ సమీపంలోని ఘట్‌కేసర్‌ వద్ద గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. దీంతో రైలు పట్టాలు దెబ్బతిన్నాయి. దీని ప్రభావం విశాఖపట్నం-సికింద్రాబాద్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు 3 గంటలపాటు ఆలస్యంగా నడవనుంది.

గోదావరి ఎక్స్​ప్రెస్ పట్టాలు తప్పిన నేపథ్యంలో రైల్వే అధికారులు పలు రైళ్లను రీషెడ్యూల్‌ చేయడంతోపాటు మరికొన్ని రైళ్లను రద్దుచేశారు. పలు రైళ్లను దారిమళ్లించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్‌ రైలు.. ఉదయం 8.45 గంటలకు ప్రారంభం కానుంది. దీంతో మధ్యాహ్నం 2.15 గంటలకు బదులుగా మధ్యాహ్నం 5 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనున్నది.

సాధారణంగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు.. ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. మధ్యలో రాజమండ్రి (7.55 గంటలు), విజయవాడ (10 గంటలు), ఖమ్మం (11 గంటలు), వరంగల్‌ (12.5 గంటలు) స్టేషన్లలో ఆగి 14.15 గంటలకు (మధ్యాహ్నం 2.15కు) సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news