సుందరకాండ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

-

సాధారణంగా చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకొని.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. మరి కొంత మంది మొదట్లో అడపాదడపా అవకాశాలు అందుకొని.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు.. ఇకపోతే చేసింది కొన్ని సినిమాలు అయినా ఇండస్ట్రీ ఉన్నంతవరకు కలకాలం గుర్తుపెట్టుకునేలా నటిస్తూ ఉంటారు. అలాంటి వారిలో వెంకటేష్ నటించిన సుందరకాండ సినిమాలో చిలిపి చేష్టలతో విద్యార్థినిగా మంచి ఆక్టింగ్ చేసి చివరిలో గుండెలు పిండేసే సన్నివేశాలతో ఆడియన్స్ ని ఎమోషనల్ కి గురిచేసింది అపర్ణ. ఈమెకు తొలి చిత్రం అయినా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

అక్క పెత్తనం – చెల్లెలు కాపురం సినిమాలో కూడా నటించిన అపర్ణ మళ్ళీ వెండి తెరపై కనిపించలేదు. ఈమె సొంత ఊరు బెంగళూరు.. నిజానికి ఆమేది తెలుగు ఫ్యామిలీ అయినా బెంగళూరులో స్థిరపడ్డారు.. తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు కావడంతో వాళ్లది ధనిక కుటుంబమే.. ఎల్కేజీ నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న ఎన్నో నాట్య ప్రదర్శనలు కూడా ఇచ్చింది. ఏకంగా 14 యేళ్లు డాన్స్ నేర్చుకున్న ఈమె.. 8వ తరగతి చదువుతున్న సమయంలోనే ఆమె ఫోటోలను చూసిన ప్రముఖ ప్రొడ్యూసర్ కేవీవీ సత్యనారాయణ సుందరకాండ మూవీలో అవకాశం ఇచ్చారు..

ఇకపోతే వరుసగా అవకాశాలు వస్తున్న నేపథ్యంలో స్టడీస్ దెబ్బ తింటాయని ఒక్కటి కూడా అంగీకరించకుండా బెంగళూరు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక్క సినిమాలో కూడా కనిపించిన అపర్ణ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 2002లో ఎన్నారై శ్రీకాంత్ ను లవ్ మ్యారేజ్ చేసుకుంది. అమెరికాలోని తెలుగు వాళ్లతో పాటు అమెరికన్స్ కి కూడా నాట్య విద్యను నేర్పిస్తూ కుటుంబంతో ఆనందంగా జీవిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news