రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక కామెంట్స్ చేసారు. తెలంగాణ ప్రభుత్వం సంవత్సర కాల పాలనలో 21 వేల కోట్ల రుణామాఫీ,7,625 వేల కోట్ల రైతు బంధు,3 వేల కోట్ల రైతు భీమా ఇచ్చాం. గతంలో ఆగిపోయిన అన్ని పధకాలు పునరుద్ధరణ చేశాం. సన్నా ధాన్యానికి బోనస్ ఇచ్చాం. మిగిలిన అన్ని పంటలకు MSP ధరకే కొనుగోలు చేశాం. రైతాంగ ఖాతాల్లో నగదు జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఉంది.
అయితే రైతు భరోసా మీద ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలనేదే స్థూలంగా ప్రభుత్వం యొక్క ఆలోచన. రైతు భరోసా మీద ఎలాంటి నిబంధనలు కానీ పంట వేయ్యనటువంటి రైతులను తగ్గించటం కోసం చేసే ప్రయత్నం కానీ ప్రభుత్వం ఇంత వరకు యే విధమైన ఆలోచన చేయ్యలేదు. క్యాబినేట్ సబ్ కమిటీ కేవలం విధి విధానాల మీద చర్చ మాత్రమే చేశాం. ఎలాంటి చర్చలు చేసిన మా ఆలోచన ఒక్కటే..పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ద్వారా ప్రభుత్వ పరంగా వేసులుబాటు ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం. ఈ రోజు ఈ నిమిషం వరకు రైతు భరోసా పై ఎలాంటి నిర్ణయం చేయ్యనటువంటి ప్రభుత్వం పై ప్రసార సాధనాల ద్వారా కానీ ప్రతి పక్షాలు దుష్పచార చేసే ఆలోచన చేయ్యోద్దు. మేము చేసిన చర్చల ఫలితాలను క్యాబినేట్ లో పెడతాం. క్యాబినేట్ యొక్క నిర్ణయమే తుది నిర్ణయం. పంట వేసిన ప్రతి రైతుకు ఎలాంటి కోతలు లేకుండా పంట సహాయం ఇవ్వాలనేదే వ్యవసాయ శాఖ మంత్రిగా నా వ్యక్తిగత అభిప్రాయం అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.