వైసీపీ నేతల చేతిలో గాయపడిన ఎంపిడివో జవహర్ బాబు ను పరామర్శించారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేసారు. గాలివీడు ఎంపిడివో జవహర్ బాబు పై దాడి హేయమైన చర్య. గత ఐదేళ్లలో అధికారం అడ్డం పెట్టుకొని యదేచ్చగా దాడులు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక దాడులు చేస్తామంటే సహించం. జగన్ అహంకారం తమ నేతలకు అలవాటు అయింది అని అన్నారు.
అలాగే ఇప్పుడు కూడా ఆఫీసుల్లోకి చొరబడి దాడి చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. మా డిప్యూటీ సిఎం 24 గంటల్లో ఘటనా స్థలానికి చేరుకొని ఎంపిడివో ను పరామర్శించారు. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. అయితే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తా అనుకోవడం కల. ఇక ఉచిత బస్సు ప్రయాణం ఉగాది నుంచి ప్రారంభిస్తాం. అధ్యయన కమిటీ కర్ణాటక, తెలంగాణ, డిల్లీ పర్యటించి నివేదిక సమర్పిస్తుంది అని మంత్రి రాంప్రసాద్ పేర్కొన్నారు.