గుజరాత్ లో మరోసారి భూకంపం వనికించింది. గుజరాత్ లోని అమ్రేలి జిల్లా సావర్ కుండ్లా తాలూకాలో గురువారం 3.1 తీవ్రతతో స్వల్ప భూకంపం నమోదయింది. ఈ విషయాన్ని భూకంప పరిశోధన సంస్థ (ఐఎస్ఆర్) అధికారి తెలిపారు. అయితే ఈ భూకంప ప్రభావంతో ఎలాంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరగలేదని ఆ అధికారి తెలిపారు.
అమ్రేలికి దక్షిణ ఆగ్నేయంగా 44 కిలోమీటర్ల దూరంలో సావర్ కుండ్ల తాలూకాలోని మిథియాల గ్రామం వద్ద 6.2 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలను మొదలైనట్లుగా గాంధీనగర్ కు చెందిన అధికారి వివరించారు. కాగా నిన్న ఢిల్లీ, చెన్నైలో స్వల్ప భూ ప్రకంపనలు నమోదు కాగా తాజాగా గుజరాత్ లో భూమి కనిపించింది. ఈనెల 19న కూడా 2.2 తీవ్రతతో కంభాలలో భూమి కనిపించింది. ఇలా వరుస భూప్రకంపనలతో ప్రజలు ఆందోళనకి గురవుతున్నారు.