BREAKING : కొండగట్టు అంజన్న ఆలయంలో భారీ దొంగతనం

-

జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో భారీ చోరీ జరిగింది. ప్రధాన ఆలయంలో భారీ ఎత్తున వెండి సామాగ్రిని కొంతమంది దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ తరుణంలోనే ఆలయ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఆలయానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇక విచారణ పూర్తయ్యే వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భద్రత ఉన్నప్పటికీ దొంగతనం జరగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గత వారం రోజుల కిందట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొండగట్టులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి తాను కృషి చేస్తానంటూ… ఏకంగా 500 కోట్ల నిధులను మంజూరు చేశారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news