ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ధాన్యం కొనుగోళ్లలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురువారం… ఏకంగా 1611.25 కోట్లను రైతుల ఖాతాలలో జమ చేసింది.
దీంతో ధాన్యం రైతులకు మొత్తం 6483 కోట్లు చెల్లించినట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలిపింది. గోనె సంచులు, హమాలి, రవాణా చార్జీల కింద 80 కోట్లను చెల్లించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 2022 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఆరు లక్షల మందికి పైగా రైతుల నుంచి 6734 కోట్ల విలువైన 32 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది.