ఈ మహిళ రక్తం నీలం రంగు చూసి షాకైన డాక్టర్లు..!

-

దంత స‌మ‌స్య‌ కార‌ణంగా ఎర్ర‌గా ఉండాల్సిన ర‌క్తం ఆ మ‌హిళ‌కు నీలం రంగంలోకి మారింది. దీంతో ఆశ్య‌ర్య‌పోయిన ఆమె వెంట‌నే హాస్ప‌ట‌ల్‌కు చేరుకుంది. వైద్య ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్లు ఆమెకు వచ్చిన అరుదైన స‌మ‌స్య‌ను గుర్తించి కంగు తిన్నారు. ఈ సంఘ‌టన అమెరికాలోని రోడ్ ఐల్యాండ్‌లో చోటుచేసుకుంది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ స‌మాచారం ప్ర‌కారం.. స‌ద‌రు మ‌హిళ కొన్ని రోజుల నుండి పంటి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంది.

ఈ నేప‌థ్యంలోనే నొప్పి నివార‌ణ‌కు ఆమె మందును వాడుతుంది. ఇక తాజాగా నిద్ర నుంచి మేల్కొనే స‌రికి ఆమె దంతాలు, శరీరం, గోళ్లు, నీలం రంగులోకి మారాయి. వెంట‌నే హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించ‌గా.. ` మేథేమోగ్లోబినేమియా ` అరుదైన రక్త రుగ్మత అని గుర్తించారు. ‘ మిథేమోగ్లోబిన్ ’ అనే పదార్థాన్ని ఎక్కువ మొతాదులో తీసుకోవ‌డం ఈ వ్యాధికి కార‌ణ‌మ‌ని వైద్యులు వెల్ల‌డించారు.

దీని కార‌ణంగానే శరీరం, గోళ్లు నీలం రంగులో మారతాయని, ఎర్ర రక్తం నీలంగామారడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుందన్నారు. అలాగే ఆమెకు విరుగుడుగా మిథిలీన్ బ్లూతో చికిత్స అందించారు. దీంతో స‌ద‌రు మ‌హిళ త‌క్కువ స‌మ‌యంలోనే కోలుకుంది. ఈ కేసును దృష్టిలో పెట్టుకుని వైద్యులు దంత సంబంధిత లిక్విడ్‌లను ఉప‌యోగించే ముందు వైద్యుల స‌ల‌హా మెర‌కే ఉప‌యోగించాల‌ని లేకపోతే ఇలాంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయ‌ని హెచ్చ‌రించారు.

Read more RELATED
Recommended to you

Latest news