కాలం మారే కొద్ది ప్రజలు మట్టిపాత్రల నుంచి అల్యూమినియం పాత్రలకు మారారు. ఎలాంటి వంటకైనా వీటినే వాడుతున్నారు. అన్నానికి ఇది మంచి పాత్రగా భావిస్తారు. అన్నానికి అయితే సరే కూరలకు కూడా వీటినే వాడుతున్నారు. దీనివల్ల చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయంటున్నారు. మరి అవేంటో తెలుసుకోవాల్సి అవసరం ఎంతో ఉంది.
1. సాధారణంగా పూర్వం మట్టి పాత్రలు ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అనేక రకాల ఐటెమ్స్ అందుబాటులో ఉన్నాయి. స్టీల్, నాన్స్టిక్లంటూ ఎన్నో ఉన్నాయి. అయితే నాన్‌స్టిక్ మంచితే కానీ ధర ఎక్కువగా ఉండడంతో అల్యూమినియం పాత్రలవైపు ఎక్కువ మొగ్గుచూపుతారు. వంట చేసేటప్పుడు గృహిణులు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. యాసిడ్స్ కలిగిన పదార్థాలు, అంటే టమాటాలు అలాగే పుల్లని పదార్థాల కోసం అల్యూమినియం పాత్రలను వాడినప్పుడు వీటి నుంచి ఎక్కువ శాతం అల్యూమినియం పదార్థాలతో కలిసే ప్రమాదం ఉంటుంది.
2. ఒకవేళ అల్యూమినియం పాత్రలను వాడాల్సి వచ్చినప్పుడు పులుపు, యాసిడ్ కలిగిన పదార్థాలు ఎక్కువసేపు నిల్వ ఉంచకూడదు. అంతేకాకుండా ఎక్కువ సమయం వేడి చేయకూడదు. క్రోమియం, లెడ్, కాడ్మియమ్, నికిల్ వంటి మిగిలిన పాత్రల్లో కంటే అల్యూమినియం పాత్రల్లో ఉడికించేటప్పుడు మూడింతలు ఎక్కువ కరిగి పదార్థాలతో కలిసే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు.
3. వీటిలో వంట చేయడం వల్ల మెదడులోని క్రోమాటిక్ నెట్‌వర్క్‌పైన ప్రభావం పడి, బ్రెయిన్ సెల్స్ డామేజ్ అయ్యే అవకాశం ఉందని వైద్య పరిశోధనల్లో రుజువైంది.
పరిష్కారం :
– అల్యూమినియం చేసే హాని నుంచి బయటపడాలంటే ఎనొడైజ్డ్ అల్యూమినియం పాత్రలను వాడుకోవాలి. ఈ ఎనొడైజ్డ్ మెటల్‌తో తయారు చేసిన పాత్రలు, పాన్లు కూడా త్వరగా వేడెక్కడమే కాకుండా, మన్నిక కూడా ఎక్కువకాలం ఉంటుంది.
– దీంతోపాటు గీతలు పడకుండా శుభ్రం చేసుకునేందుకు కూడా సులువుగా ఉంటాయి. ఈ ఎనొడైజ్డ్ అల్యూమినియం పాత్రలలో పదార్థాలు వండడం వల్ల అల్యూమినియం పదార్థాలతో కలిసే ప్రమాదం అంతగా లేదని పరిశోధకులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే బాగా బాయిల్ చేసి వండే ఏ వంటకాన్నైనా అల్యూమినియం పాత్రల్ని వాడకపోవటమే మంచిదంటున్నారు.