మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత.. ధ్రువీకరించిన అపోలో

-

చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు, సినీ నటుడు నారమల్లి శివప్రసాద్‌(68) ఆరోగ్యం మరింత క్షీణించ‌డంతో ఈ రోజు  మధ్యాహ్నం 1.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో సతమతమవుతున్న శివప్రసాద్‌ కు కిడ్నీ సంబంధిత సమస్య తలెత్తడంతో రెండు రోజుల క్రితమే చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా మార‌డంతో.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నా ఏ మాత్రం ఫ‌లితం లేక‌పోయింది.

నార‌మ‌ల్లి శివప్రసాద్‌ 1951 జులై 11న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో జన్మించారు. శివప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. అయితే ఆయ‌న‌కు చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఇష్టం. ఈ క్ర‌మంలోనే ఈయ‌న‌ పలు సినిమాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా న‌టింంచి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. అలాగే ఈయ‌న స్వతహాగా రంగస్థల నటుడు. అదే విధంగా కొన్ని సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించారు.


2009, 2014 లో చిత్తూరు నుంచి రెండు సార్లు టీడీపీ ఎంపీ గా గెలిచిన శివప్రసాద్‌ గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో తనదైన ప్రత్యేక శైలితో శివ ప్రసాద్‌ ఆకట్టుకున్నారు. ఇక  శివప్రసాద్‌ స్వ‌త‌హాగా న‌టుడు కావ‌డంతో  రోజుకొక వేషధారణల్లో కనిపిస్తూ ఏపీ ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌ లో వినూత్న రీతిలో నిరసనలు తెలిపి పోరాటం చేశారు. ఇక న‌టుడిగా, నాయ‌కుడిగా పేరు సంపాధించుకున్న నార‌మ‌ల్లి శివ‌ప్ర‌సాద్ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు.

Read more RELATED
Recommended to you

Latest news