BREAKING : EDకి ఎమ్మెల్సీ కవిత లేఖ..నేను విచారణకు రాను !

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ మేరకు EDకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. రేపు ఈడీ ఎదుట విచారణకు హాజరు కాలేనని 15న హాజరవుతానని లేఖ రాశారు. 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ ఫిక్స్ అయ్యాయని ఈడీకి వివరణ ఇచ్చారు కవిత. ఇక ఈడీ స్పందన కోసం కవిత వెయిటింగ్ చేస్తోంది.

ఇక దర్యాప్తు సంస్థకు పూర్తిగా సహకరిస్తానని కవిత స్పష్టం చేశారు. అయితే హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానని వెల్లడించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన కవిత… ఎల్లుండి తాను దిల్లీలో నిరసన దీక్ష తలపెట్టాననీ…ఈ క్రమంలోనే రేపు విచారణకు రావాలని ఈడీ ఆదేశించిందని అన్నారు. ‘రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది మా డిమాండ్. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news