కేసీఆర్ పై మోడీ కుట్ర లో భాగమే కవిత కు నోటీసులు – జగదీష్ రెడ్డి

-

కేసీఆర్ పై మోడీ కుట్రలో భాగమే కవిత కు నోటీసులు అని మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత కు ఈడి నోటీసు ల పై స్పందించారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. కవిత కు ఈడి నోటీసులు ..మోడీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అని.. రాజకీయ దురుద్దేశంతోనే కవిత పై ఆరోపణలు అని నిప్పులు చెరిగారు.

మోడీ దురాగతాలను బయట పెడుతున్న కేసీఆర్ పై మోడీ కుట్ర లో భాగమే కవిత కు నోటీసులు.. అణచివేత దోరణితోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తుంది బిజెపి అన్నారు. మోడీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడినయ్… ప్రజల కోసం పని చేసే నేతలకు కేసులు, జైళ్ల కొత్త కాదని వెల్లడించారు. నియంతలు నిలబడిన చరిత్ర ఏనాడూ లేదు… బిజెపి అసలు రూపాన్ని ప్రజా క్షేత్రంలో బట్టబయలు చేస్తామని హెచ్చరించారు మంత్రి జగదీష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news