ఈ మధ్య కాలం లో ప్రతీ ఒక్కరు సమస్యలేమీ లేకుండా హాయిగా ఉండాలని చూస్తున్నారు. మీరు కూడా భవిష్యత్తు లో ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే కొన్ని పథకాల్లో డబ్బులు పెట్టండి. వీటి వలన ఏ ఇబ్బంది ఉండదు. అలానే హాయిగా ఉండచ్చు. పోస్టాఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటిలో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఒకటి. ఈ పథకం లో చేరితే ప్రతి నెలా కచ్చితంగా డబ్బులు వస్తాయి. పైగా రిస్క్ ఉండదు. కచ్చితమైన రాబడి వస్తుంది. ఇక మరి దీని కోసం పూర్తి వివరాలని చూసేస్తే..
ఈ స్కీమ్‌లో చేరాలని భావించే వారు ఒకసారి డబ్బులని పెట్టాలి. ఈ డబ్బుపై మీరు ప్రతి నెలా వడ్డీ రూపంలో రాబడి పొందొచ్చు. అలానే మెచ్యూరిటీ తర్వాత మీకు డబ్బులు వస్తాయి. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కింద మీరు రూ. 9 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. జాయింట్ అకౌంట్ తెరిస్తే రూ. 15 లక్షల వరకు డబ్బులు పెట్టచ్చు.
కేంద్రం తాజా బడ్జెట్లో ఈ లిమిట్ ని పెంచింది కూడా. దీనిలో గరిష్గంగా రూ. 9 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసేయచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ వస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ లో మార్పు రావచ్చు. ఉదాహరణకు దీనిలో రూ. 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. చేతికి ప్రతి నెలా రూ. 8,800 దాకా వస్తాయి.
ఇలా మీరు ఐదేళ్ల పాటు పొందొచ్చు. ఏడాది నుంచి మూడేళ్ల కాలంలో డబ్బులు విత్‌డ్రా చెయ్యాలో అంటే డిపాజిట్ అమౌంట్లో 2 శాతం ఉంటుంది. మూడేళ్ల తర్వాత విత్‌డ్రా చేసుకుంటే ఒక శాతం చెల్లించుకోవాలి. ఐదేళ్ల తర్వాత డబ్బులొస్తాయి. మెచ్యూరిటీ కాలాన్ని మరో ఐదేళ్లు ఎక్స్టెండ్ చెయ్యచ్చు.