వీరి పాన్‌ కార్డులు రద్దు… కారణం ఏమిటో తెలుసా..?

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు కూడా ఒకటి. పాన్ కార్డు కూడా ప్రతీ ఒక్కరికీ ఎంతో అవసరం. అలానే ఆధార్ కార్డు కూడా ఎంతో అవసరం. బ్యాంకు లావాదేవీల విషయంలో పాన్ కార్డు ముఖ్యము. ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు విషయంలో నిబంధనలు ఇంకా స్ట్రిక్ట్ గా మారుతున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలని చూసేద్దాం. ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయడం తప్పనిసరి అని కేంద్రం అంటూనే వుంది. ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయడం తప్పనిసరి.

ఈ విషయం కేంద్రమే చాలా సార్లు చెప్పింది. ఈ రెండింటిని అనుసంధానం చేసేందుకు గడువు కూడా విధిస్తూ ఎక్స్టెండ్ చేసారు. పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయకపోతే వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే పాన్‌ చెల్లుబాటు అవ్వదు. మార్చి 31లోగా మీ పాన్‌కార్డును ఆధార్‌తో తప్పక లింక్ చేసేయండి.

మీ పాన్‌ కార్డు యాక్టివ్‌గా ఉండాలంటే దీన్ని మరచిపోవద్దు. ఏప్రిల్ 1, 2022 నుండి మీరు మీ పాన్‌ని ఆధార్‌ తో లింక్ చేస్తే ఫైన్ కట్టాలి. జూలై 1, 2022 తర్వాత లింక్‌ చేసినట్లయితే రూ.1000 చెల్లించాల్సి వుంది. NSDL పోర్టల్ ని సందర్శించి ఆధార్-పాన్ లింక్ చేసుకోవచ్చు. CHALLAN NO./ITNS 280 క్రింద ఉన్న ప్రొసీడ్ ఎంపికపై క్లిక్ చెయ్యాలి. ఆ తర్వాత మీకు వర్తించే పన్నును ఎంచుకోండి. ఇలా ఈజీ ప్రాసెస్ ద్వారా మీరు లింక్ చేసేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news