జగన్‌ ప్రభుత్వంపై ఇక తిరుగుబాటే – రఘురామకృష్ణం రాజు

-

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కేవలం విద్యావంతుల్లో వచ్చిన తిరుగుబాటే అనుకుంటే పొరపాటు అని, ఇది ప్రజాస్పందన అని, ప్రజల్లో మార్పు మొదలైందని, రకరకాల కాంబినేషన్ వల్ల, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను ఓడించారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. ఇది ఓవరాల్ ప్రజాస్పందన అని, ప్రజలు ఇలాగే డిసైడ్ అయిపోయారని అన్నారు. గత రెండున్నర ఏళ్లుగా ఇదే విషయాన్ని తాను చెబుతున్నానని, అయినా తనను అక్రమ కేసులలో అరెస్టు చేసి చితకబాదారని అన్నారు. అయినా తాను నిజం చెప్పడం ఆపలేదని, అధికార పార్టీ చాప్టర్ క్లోజ్ అయిందని ఆయన అన్నారు.
తాజాగా రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణ రాజు గారు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… 108 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడిన ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పటి వరకు భయంతో భయపడిన ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ధైర్యంగా బయటకు వచ్చారని, ఈ ప్రభుత్వం పని అయిపోయిందని, ఇంకా మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ధైర్యంతో వారంతా బయటకు వచ్చారని తెలిపారు. రోజు, రోజుకి ఈ ధైర్యం ఎక్కువ అవుతుందన్నడంలో సందేహం లేదని, కడప, కర్నూల్, అనంతపూర్ పాత జిల్లాలకు చెందిన పశ్చిమ రాయలసీమ టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు ఏ ఒక్క ఓటర్ కు రూపాయి పంచలేదని, తమ పార్టీ నాయకులు బూతుల వద్దే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారని అన్నారు.
టీడీపీ అభ్యర్థులు చిరంజీవి, శ్రీకాంత్ లు కూడా ఓటర్లకు ఒక్క రూపాయ పంచిన దాఖలాలు లేవన్నారు. వెన్నపూస రెడ్డి వెన్నపూస కరిగినట్లుగా ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేసినప్పటికీ, అధికార పక్షానికి ప్రజలు గుణపాఠం చెప్పారని, ఎన్నికల్లో డబ్బుల ప్రభావం కేవలం కొద్దిగా మాత్రమే చూపిస్తుందని అధికార, ప్రతిపక్ష పార్టీలు గుర్తించాలని సూచించారు. తమ పార్టీ నాయకులు 1000 నుంచి మొదలుకొని 5000 రూపాయల వరకు ఖర్చు చేసినప్పటికీ, గతంలో తమ పార్టీకి వచ్చినట్లుగా 50% మెజార్టీ టీడీపీ అభ్యర్థులకు వచ్చిందన్నారు. ఎన్నికల్లో ధనం పనిచేయదని, తమ పార్టీ నేతల సరదా తీర్చడానికి జనం డబ్బులు తీసుకున్నప్పటికీ ఓటు వేయలేదని అన్నారు. ఓటు కోసం డబ్బులు తీసుకోవద్దని కేవలం అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటు వేయాలని అన్నారు. ప్రజలు పడిన కష్టాలు, నష్టాలు బేరిజు వేసుకొని ఓటు వేయాలన్నారు. ఓటుకు వెయ్యి రూపాయలు ఇవ్వడం అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా రోజుకు 30 నుంచి 50 పైసల మేరకు ఇచ్చినట్లేనని, ప్రజలపై మాత్రం రోజుకు 25 రూపాయల పన్నులు విధిస్తున్నారని, అర్ధ రూపాయి కోసం కాకుండా, పాప పరిహారం కోసం పైసలు ఇస్తామంటే తీసుకోవాలని రఘురామకృష్ణ రాజు గారు సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళని దేవుడి హుండీలో పైసలు వేసినట్లుగా, ప్రజలే దేవుళ్లను కొని డబ్బులు ఇస్తే స్వీకరించాలని రఘురామకృష్ణ రాజు గారు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news