సూపర్ స్కీమ్.. నెలకు రూ.200 కడితే.. నెల నెలా రూ.5 వేలు.. ఒకేసారి రూ.8.5 లక్షలు..!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీముల వలన చాలా మంది ప్రయోజనాలని పొందుతున్నారు. పైగా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఇప్పటికే కేంద్రం తీసుకు వచ్చిన అనేక రకాల పథకాల్లో చాలా మంది డబ్బులు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో అటల్ పెన్షన్ యోజన కూడా ఒకటి. ఈ స్కీమ్ లో కనుక చేరితే ప్రతి నెలా మీకు రూ. 5 వేల వరకు వస్తాయి. ఈ స్కీమ్ లో కనీసం రూ. 1000 పెన్షన్ వస్తుంది. ఈ డబ్బులని కనుక పొందాలి అంటే ఈ స్కీమ్ లో చేరవచ్చు.

money
money

అటల్ పెన్షన్ యోజన అర్హత వివరాలు:

18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు వయసు వున్నవాళ్లు భారత ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీమ్‌ లో చేరడానికి అర్హులే. 40 ఏళ్లు దాటితే చేరడానికి అవకాశం లేదు కనుక ముందే చేరాలి. ఈ స్కీమ్‌ లో కనుక చేరితే ప్రతి నెలా కొంత మొత్త చెల్లిస్తూ ఉండాలి. మీ వయసు ని బట్టీ డబ్బుల ని చెల్లించాల్సిన మొత్తం కూడా మారుతుంది. ప్రతి నెలా పొందే పెన్షన్ ప్రాతిపదికన కూడా నెల వారీగా చెల్లించాల్సిన మొత్తం మారుతూ ఉంటుంది.

అటల్ పెన్షన్ యోజన తో ఎంత వస్తుంది…?

అటల్ పెన్షన్ యోజన స్కీమ్ లో చేరిన వాళ్ల కి 60 ఏళ్లు వచ్చిన తర్వాతనే పెన్షన్ వస్తుంది. రూ. 1000, రూ.2000, రూ.3000 ఇలా పెన్షన్ వస్తూ ఉంటుంది. నెలకు రూ. 42 నుంచి చెల్లించాల్సి వస్తుంది. ఈ స్కీమ్ కింద మీరు రూ. 2 వేలని పెన్షన్ గా పొందాలి అంటే నెలకు రూ. 84 నుంచి కట్టాల్సి ఉంటుంది. అదే మీరు రూ. 3 వేల పెన్షన్ కోసం రూ. 126 కట్టాల్సి వుంది. నెలకు రూ. 168 నుంచి కనుక కడుతూ వెళ్లారంటే రూ. 4 వేల ని పొందవచ్చు. రూ. 210 నుంచి కట్టారంటే నెలకి ఐదు వేలు వస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news